ఏపీ కొవిడ్-19 అప్ డేట్: రాష్ట్రంలో కొత్తగా 10,418 పాజిటివ్ కేసులు, 74 మరణాలు

  • ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
  • మరోమారు పది వేలకు పైగా కొత్త కేసులు
  • తాజాగా 9,842 మందికి కరోనా నుంచి విముక్తి
ఏపీలో కరోనా వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగానే కొనసాగుతోంది. మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 71,692 నమూనాలు పరీక్షించగా 10,418 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కి చేరింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మృత్యువాత పడగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,634కి పెరిగింది. తాజాగా 9,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా ఇప్పటివరకు 4,25,607 మందికి కరోనా నయం అయింది. ఇంకా, 97,271 మందికి చికిత్స కొనసాగుతోంది.

COVID-19
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News